
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్19(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
ఎమ్మెల్యే జె.సి.అస్మిత్ రెడ్డి ఆదేశాలమేరకు యాడికిపట్టణంనందు పలుకాలనీలలో అభివృద్ధిపనులు వేగంగా కొనసాగుచున్నయి గత సార్వత్రిక ఎన్నికలలో జె.సి. అస్మిత్ రెడ్డికి ప్రచారానికి వెళ్లినప్పుడు చెన్నకేశవ స్వామి కాలనీలోని ప్రజలు కల్వర్టు లేక మురికి కాలువలలోనే రాకపోకలు సాగిస్తున్నాం అని తెలపడంతో కాలనీవాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, అధికారులతో చర్చించి కల్వర్టు మంజూరు చేయించి ఈరోజు కల్వర్టు పనులను గుత్తేదారులు ప్రారంభించి నిర్మాణ పనులను వేగంగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జె.సి. అష్మిత్ రెడ్డి గారికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పనులను మండల టి.డి.పి. బీ.సీ.సెల్ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ పర్యవేక్షించారు. ఫైబర్ చందు, సెల్ పాయింట్ చాంద్ బాషా, రహంతుల్లా, కోటవీధి షేక్షా, పూలతోట రవి, పాండు, పూలతోట ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.
