పయనించే సూర్యుడు మార్చి 7 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నందు చెత్త నుండి సంపద . ఘన వ్యర్ధాల సమర్థ నిర్వహణ కొరకు ఆత్మకూరు మండలం నందు గుర్తించబడిన స్థానిక శిక్షణ కేంద్రం ఎల్ టి సి. కరటంపాడు ఎస్ డబ్ల్యూ పిసి. షెడ్ నందు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించడమైనది. కరటంపాడు ఎస్ డబ్ల్యూ పిసి షెడ్డు ఎల్ టి సి .కేంద్రం నందు అనుముసముద్రంపేట మండలంలోని మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలోవిస్తరణాధికారి, పంచాయతీ కార్యదర్శులు గ్రీన్ అంబాసిడర్లు గ్రీన్ గార్డులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఎస్ పేట ఎంపీడీవో ప్రసన్నకుమారి ఆత్మకూరు ఎంపీడీవో ఐసాక్ ప్రవీణ్ కరటంపాడు గ్రామ సర్పంచ్ పి.రేవతి .టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు దావా పెంచల రావు కరటంపాడు గ్రామ గార్లపాటి ఫౌండేషన్ వ్యవస్థాపకులు గార్లపాటి వేణుగోపాల్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరైనారు.చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను అన్ని గ్రామ పంచాయతీలలో నిర్వహించడానికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కరటంపాడు ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రంలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రీన్ అంబాసిడర్ల ద్వారా ప్రతి ఇంటి నుంచి తడి చెత్తను ,పొడి చెత్తను విడివిడిగా సేకరించి ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాలకు తరలించి వానపాముల ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేయవలెను దీనివలన గ్రామాలలోని వ్యర్ధాలు తరలింపబడి గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి. ఈ వ్యర్ధాలను సేంద్రియ ఎరువుగా మార్చడం వలన గ్రామాలను ఆదాయం చేకూరడంతో పాటుగా నాణ్యమైన పంట పండించడానికి వీలవుతుంది. కాబట్టి అన్నిగ్రామపంచాయతీలలో ఎస్ డబ్ల్యు పి సి కేంద్రాలను నిర్వహించవలసినదిగా కోరడమైనది.శిక్షణ కార్యక్రమం ఆత్మకూరు . ఏఎస్ పేట .ఎంపీడీవోలు ఈ ఓ ఆర్ డి ఓ లు . వి డేవిడ్ , రమేష్, ట్రైనర్స్ ఎం కిషన్, షేక్ షఫీ ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఫీల్డ్ విసిట్ నిర్వహించి తడి చెత్త ,పొడి చెత్తను సేకరించి విధానము మరియు వర్మీ కంపోస్టు తయారి విధానం గూర్చి వివరించడమైనది. ప్రకృతి వ్యవసాయ కోఆర్డినేటర్ సుబ్బరాయుడు ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు .మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమంలో చివరగా అందరూ మహిళ గ్రీన్ అంబాసిడర్లకు శాలువాతో సత్కరించడం అయినది. అదేవిధంగా సర్పంచ్ పి. రేవతి ని కూడా సన్మానించడం అయినది. ఈ కార్యక్రమంలో . ఏఎస్ పేట మండలంలోని అందరూ పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గర్డ్లు. తదితరులు పాల్గొన్నారు.