
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 25 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి శ్రీలక్ష్మీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీవారికి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపడం ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం పెళ్లి కొడుకును చేయడం వంటి కార్యక్రమాలు దేవస్థానం తరపున నిర్వహించారు ఈ కార్యక్రమానికి యాడికి ఆర్యవైశ్యులు కీర్తిశేషులు దేవిశెట్టి విశ్వనాథ్ ధర్మపత్ని అనురాధ దాదాపుగా 10 లక్షల రూపాయలు విలువచేసే 60 గ్రాములకు పైగా బంగారు యజ్ఞోపవేతం చేపించడం జరిగింది వారిని భాజా భజంత్రీలచే ఆలయ పెద్దలు ఊరేగింపుగా శోభాయాత్రగా వారి ఇంటి నుండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వరకు తీసుకువచ్చి పూజారి కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి బంగారు యజ్ఞోపవేతం సమర్పించడం జరిగింది వారికి వారి కుటుంబానికి స్వామి వారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని వేద పండితులు హరి స్వామి వారిని ఆశీర్వదించడం జరిగింది

