
పయనించే సూర్యుడు ఏప్రిల్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
చెయ్యేరు గ్రామ పంచాయతీ స్వర్ణ గ్రామ సచివాలయం 1&2 లను ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆకశ్మిక సందర్శన చేశారు. చేశారు. ఆయా స్వర్ణ గ్రామ సచివాలయం సిబ్బంది ఆన్లైన్ హాజరు వివరాలను నిశితంగా పరిశీలించారు.కొంతమంది సిబ్బంది నిర్నీత సమయంలో హాజరు వేయకపోవడం & ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడన్ని తీవ్రంగా పరిగణించారు . విధిగా సమయపాలన పాటించాలని,ప్రజనీకానికి నిరంతరం అందుబాటులో ఉంటూ, పౌర సేవలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. కార్యాలయానికి వచ్చే ప్రజనీకంతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, పౌర సేవలు గూర్చి సానుకూలంగా వివరిస్తూ జవాబుదారితనం వహించాలని సూచించారు.డిజిటల్ అసిస్టెంట్ శ్రీరామలక్ష్మి పనితీరుపై పౌర సేవల నిమిత్తం వచ్చే ప్రజానీకం హర్షం వ్యక్తం చేయడాన్ని ఈ సందర్బంగా అభినందించారు. పారిశుధ్యం, మంచినీరు మరియు వీధిదీపాలు వంటి మౌళిక అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు . విధుల నిర్వాహణలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సదరు సందర్శనలో పంచాయతీ కార్యదర్శులు & స్వర్ణ సచివాలయం 1& 2 సిబ్బంది పాల్గొన్నారు.*
