
పయనించే సూర్యుడు జూలై 19 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం, ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మె నే టికీ,ఇంజనీరింగ్ కార్మికులు 7వ రోజుకు, పారిశుద్ధ కార్మికులు 4వ రోజుకు చేరింది. ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద గల శిబిరంలో కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకొని, మోకాళ్లపై నిల్చొని, నిరసన తెలియజేయడం జరిగింది. కార్మికులను ఉద్దేశించి సూళ్లూరుపేట పట్టణ నాయకులు ఎస్.కె రియాజ్ గారు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల జీతభత్యాలు పెంచాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కార్మికులకు వర్తింపజేయాలని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు . ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మిక సంఘ నాయకులను చర్చలకు ఆహ్వానించి కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పై కార్యక్రమంలో టౌన్ ఆగ్జలరిశాఖ సభ్యులు, ఎస్ కె ఫయాజ్, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు వెంకటరత్నం, రామయ్య, చిన్నయ్య, మురళి, కరీం, బాబు, తదితరులు పాల్గొన్నారు.