పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 14 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశ బోయిన మహేష్
చేగుంట మండలంలో టోకెన్లు ఇచ్చిన వ్యవసాయ అధికారులు వచ్చేనెల కావలసిన యూరియా కూడా ఇప్పుడే కొని పెట్టుకుందాం అనే ఆలోచనతో కృత్రిమ కొరత ఏర్పడుతుంది. కావున నెలలో కావలసిన యూరియా కచ్చితంగా, ఈ నెలలో సరఫరా చేయడం జరుగుతుంది.కావున అనవసరంగా దొరకదేమో అనే భయంతో రైతులు ఇప్పుడే కొని పెట్టుకోవడం వలన, యూరియాకు కృత్రిమ కొరత ఏర్పడుతుంది. కావున రైతులు వచ్చే అవసరం కోసం, వచ్చే నెల లోనే కచ్చితంగా యూరియా సరఫరా ఉంటుంది, కావున రైతులు యూరియా కోసం ఎలాంటి ఆందోళన పడవలసిన అవసరం లేదని చేగుంట, మండలం వ్యవసాయ అధికారి పత్రికముకంగా తెలియజేసినారు. అలాగే రైతులు యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడుకోవచ్చని రైతులకి తెలియజేయడం జరిగింది . మోతాదుకు మించి యూరియా వాడిన దాని ఫలితాలు ఉండవని, తెగుళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారి హరిప్రసాద్, వ్యవసాయ అధికారులు తెలియజేశారు.ఇట్టి కార్యక్రమంలో ఏ ఈ ఓ మాధవి మేడం మరియు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు