పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 మెదక్ జిల్లా చేగుంట మండల ప్రతినిధి కాశబొయిన మహేష్
చేగుంట బ్రిలియంట్ స్కూల్ లో ఈరోజు విద్యార్థులకు రంగోలి పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగింది సంక్రాంతి ను పురస్కరించుకొని ఈ పోటీలను నిర్వహించడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు పతంగులను ఎగురవేయడం కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది కాశ బోయిన అభిలాష్ మడిగల రితిక మరియు వర్షిని ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది . గెలుపొందిన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణ కుమార్ అభినందించారు ఈ కార్యక్రమంలో మరియు స్కూలు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు