పయనించే సూర్యుడు జూలై 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల గ్రామంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు మతపరమైన.శాంతియుత వాతావరణంలో జరిగిన ఈ ఉత్సవాలలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొహరం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఊరేగింపులు, మతపరమైన ఉపన్యాసాలు, దర్గా సందర్శనలు మొదలైనవి నిర్వహించబడినాయి. కమిటీ సభ్యులు షేక్ నజీర్, షేక్ మహ్మద్ అలీ, షేక్ నజీర్,షేక్ రఫీ తదితరులు కార్యక్రమాల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు. సంఘీభావం, సాంప్రదాయాల పరిరక్షణకు మొహరం వేడుకలు నిదర్శనంగా నిలిచాయి. ప్రజలు సామూహికంగా ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు