పయనించే సూర్యుడు ఆగస్టు 16( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్లలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా స్థానిక తాసిల్దార్ కార్యాలయం నందు తాసిల్దార్ మురళి శుక్రవారం జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనకు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరములు అయిన సందర్భంగా ప్రతి ఒక్క పౌరుడు 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని కొనియాడుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలములోని అన్ని ప్రభుత్వ కార్యాలయం స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ కార్యాలయం సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు