పయనించే సూర్యుడు మే 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో దాదాపు లక్షకు పైగా సభ్యత్వాలు చేసి రాష్ట్రంలో మొదటి ఐదు స్థానాలలో ఒకటిగా నిలిచింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి. ఆదేశాల మేరకు చేజర్ల మండల కేంద్రంలో జిల్లా టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీ .రావి పెంచల రెడ్డి , మండల టీడీపీ అధ్యక్షులు రావి లక్ష్మీనరసారెడ్డి . మండల ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వం కార్డులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చేజర్ల మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు