పయనించే సూర్యుడు అక్టోబర్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలో ఎంపీడీఓగా ఎ. అలీషా బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా బాపట్ల నుండి చేజర్ల మండలానికి బదిలీ అయ్యిన ఆయన, అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ అలీషా బాబు మాట్లాడుతూ, మండల పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి కృషి చేస్తానని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.పదవీ స్వీకార కార్యక్రమంలో మండల పరిధిలోని సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ వలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని కొత్త ఎంపీడీఓని అభినందించారు.