పయనించే సూర్యుడు మార్చి 9 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలోని జామియా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందును పట్టణ ఆర్యవైశ్య మిత్రులు ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్న దేవతి రమేష్ బాబు ముస్లిం సోదరులకు సొంత ఖర్చులతో ఇఫ్తార్ విందు అందించారు. హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో తమ గ్రామ ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఉపవాసాల అనంతరం వారికి ఇఫ్తార్ విందు ఇవ్వాలనే ఆలోచనతో గ్రామానికి చెందిన ప్రస్తుతం ముంబైలో నివసించే ఆర్యవైశ్యలు దేవతి రమేష్ బాబు .జామియా మసీదులో ఉపవాసం అనంతరం ముస్లిం సోదరులకు వివిధ రకాల వంటలతో ఇఫ్తార్ విందు అందించారు. తన సన్నిహితులు చేజర్ల గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు సిరాజుద్దీన్ సహకారంతో ఈ ఇఫ్తార్ విందును అందించారు.ఈ కార్యక్రమంలో చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రావి లక్ష్మీనరసిరెడ్డి, తూమాటి ప్రసాద్ రెడ్డి, తూమాటి. వీర రాఘవరెడ్డి, ఆది. పెంచిలనర్సారెడ్డి. వంగవరపు ఆనంద రెడ్డి. రావి. కృష్ణారెడ్డి. అరవ. గోపిరెడ్డి తో పాటు గ్రామానికి చెందిన మైనార్టీ నేతలు సయ్యద్ షూకుర్, మజీద్ ఇమామ్ షాబాజ్, మౌజన్ ఇస్మాయిల్ తదితరులు హాజరయ్యారు..తమ వీధిలో అత్యధికలు ముస్లిమ్ కుటుంబాలు ఉండడంతో మొదటి నుండి తమకు వారితో సన్నిహిత అనుబంధ ఉందని ఈరోజు ముస్లిం సోదరులకు తాను ఇఫ్తార్ అందించడం ఎంతో సంతోషంగా ఉందని అల్లా కార్యక్రమంలో తాను పాలుపంచుకోవడం ఎంతో పుణ్యంగా తాను భావిస్తున్నానని ఈ సందర్భంగా దేవతి. రమేష్ బాబు.తెలిపారు.తమ గ్రామ నివాసి ఆర్యవైశ్యులైన మా మిత్రులు ఇఫ్తార్ విందును ముస్లిం సోదరులకు అందించేందుకు ఆసక్తి చూపడం నేడు ఇఫ్తార్ అందించడం నిజంగా తనకి ఎంతో సంతోషంగా ఉందని సిరాజుద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న వీరిని ముస్లిం సోదరులు సన్మానించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు