పయనించే సూర్యుడు మే 26 ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య : రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సంస్థ గత ఎన్నికలు నిర్వహిస్తూ జిల్లా, మండలలో పార్టీ నాయకులను ఎన్నుకున్న క్రమంలో చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించబడిన షేక్. సిరాజుద్దీన్. చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా తనను ఎన్నుకున్నందుకు మా ప్రియతమ నేత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డికి, నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకులు మా ప్రియతమ నేత తాళ్లూరు.గిరినాయుడుకి మండల తెలుగుదేశం పార్టీ నేతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ నేతల అందరి సహకారంతో మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సూచనలు పాటిస్తూ అహర్నిశలు శ్రమిస్తానని ఈ సందర్భంగా సిరాజుద్దీన్ తెలిపారు.