చాతగానోళ్లు, వయసు మీద బడ్డ ముసలోళ్ళు, పెదోళ్లు ఏమి చేయలేరనేనా నిర్లక్ష్యం..?
ఆగస్టు 13న చలో హైదరాబాద్ పెన్షన్ పెంచకపోతే లక్షలాది మందితో పెన్షన్ దారుల గర్జన నిర్వహిస్తాం
ఎమ్మార్పీఎస్ ఫరూఖ్ నగర్ మండల ఇంచార్జి జోగు నాగభూషణ్ మాదిగ.
( పయనించే సూర్యుడు ఆగస్టు 01 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
పెన్షన్ దార్ల సమస్యలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నదని, ఇచ్చిన హామీని తప్పి 20 నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రికి పట్టింపులేదని, చాతగానోళ్లు, వయసు మీద బడ్డ ముసలోళ్ళు, పెదోళ్లు ఏమి చేయలేరనేనా నిర్లక్ష్యం..? అని ఎమ్మార్పీఎస్ ఫరక్ నగర్ మండల ఇంచార్జి జోగు నాగభూషణ్ మాదిగ ప్రశ్నించారు.ఫరూక్నగర్ మండల కేంద్రంలోని కిషన్ నగర్ గ్రామంలో పెన్షన్ దారులతో చైతన్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ ఫరూక్నగర్ మండల ఇంచార్జి జోగు నాగభూషణ్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఏడు సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు రాక, వచ్చే పింఛన్లు సకాలంలో అందక, పెన్షన్ దారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కన్న కొడుకులు బువ్వ పెట్టక పట్టించుకోని పరిస్థితులు ఏర్పడుతుంటే, వారికి ఆసరా అయ్యే పెన్షన్ కూడా సమయానికి అందడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడే నైజం ఉంటే తక్షణమే పెన్షన్ పై ఇచ్చిన హామీని నెరవేర్చాలని వృద్ధులు వితంతువులు చేయుత పెన్షన్లను 4 వేలకు, వికలాంగుల పెన్షన్ 6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.పెన్షన్ పై నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి పోరాటాల ద్వారానే తగిన గుణపాఠం చెప్పేందుకు ఎమ్మార్పీఎస్ ప్రజలందరినీ కూడగట్టి పోరాటాన్ని కొనసాగిస్తుందని, అందులో భాగంగా ఆగస్టు 13లోగా పెన్షన్ పై ప్రభుత్వ స్పందించాలని లేకపోతే లక్షలాదిమందితో చలో హైదరాబాద్ పెన్షన్ దారుల మహా గర్జనను నిర్వహిస్తామని అన్నారు. పెన్షన్ దారుల కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పెన్షన్ దారులు జోగు అంతమ్మ, చిట్యాల సుగుణమ్మ, లక్ష్మమ్మ, విట్యాల అండాలు, మహదేవ్ పురం లక్ష్మయ్య, మహమ్మద్ యూసఫ్, రసూల్, యాదయ్య తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.