
ముఖ్యఅతిథిగా పాల్గొన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ కామర్స్ లెక్చరర్ కరుణాకర్
( పయనించే సూర్యుడు జూన్ 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )షాద్నగర్ పట్టణంలోని చైతన్య కళాశాల 2005 - 2007 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులు నక్షత్ర బంకేట్ హాల్లో అపూర్వ సమ్మేళనం పేరిట ఎంపీసీ పూర్వ విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంతో కలుసుకున్నారు.కార్యక్రమంలో వాళ్లకు పాఠాలు బోధించిన ఉపన్యాసకులను సన్మానించి పాత జ్ఞాపకాలను పరస్పరంపంచుకున్నారు.విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కామర్స్ లెక్చరర్ మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్… విద్యార్థులందరినీ అభినందించారు ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలలో మంచి ఉద్యోగాలు నిర్వహిస్తూ చక్కని స్థాయిలో ఉన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.తెలుగు అధ్యాపకులు సాకేత్ ప్రవీణ్ మాట్లాడుతూ….. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు గురుశిష్యుల మధ్య అనుబంధాన్ని మరింత పటిష్టం చేస్తాయని ఇలాంటి సమ్మేళనాలు జరగాలని అభిప్రాయపడ్డారు రసాయన శాస్త్ర అధ్యాపకులు కృష్ణయ్య గణిత శాస్త్ర అధ్యాపకులు శ్రీ వర్ధన్ రెడ్డి ఆంగ్లో ఉపన్యాసకులు రాజశేఖర్ రావు ముజఫర్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులలో రాజకీయ నాయకులు లెక్చరర్లు బ్యాంకు ఉద్యోగులు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న విద్యార్థులు అనేక ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలలో బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని ఉపన్యాసక బృందం అభినందించి ఆశీర్వదించారు.సమాజ సేవకులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య మధుర జ్ఞాపకాల మధ్య సాగిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.