
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 06.
శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని చండూరు మండలం చొప్పరివారి గూడెం సర్పంచ్ చొప్పరి వెంకన్న మరియు గ్రామస్తులకు పంచాంగాన్ని కస్తాల గ్రామ వేద పండితులు వేమవరపు వెంకటరమణ శర్మ అందజేయడం జరిగింది . రానున్న శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరంలో చొప్పరిరి వారి గూడెం గ్రామా ప్రజలు అందరు సుభిక్షంగా ఉండాలని ఆశిర్వదించారు. ప్రజలంతా ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకన్న ,శేఖర్,రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.