పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 న్యూస్ టి కే గంగాధర్
ప్రశాంత్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
బుధవారం రోజున నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు వచ్చి భీంగల్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముందు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి లేనిపోని రాద్ధాంతం చేసినా రాజకీయ కుట్రను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేస్తున్న అభివృద్ధి పనులు గాని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గాని ప్రశాంత్ రెడ్డికి కనిపించడం లేదా, గతంలో బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేస్తున్న అభివృద్ధి పనులు చూడలేక,కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రశాంత్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. కచ్చితంగా షాదీ ముబారక్ ,కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చి తీరుతాము. బిఆర్ఎస్ పార్టీ లాగా పది సంవత్సరాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో, దళితులకు మూడు ఎకరాల భూమి పేరుతో, ఇంటికొక ఉద్యోగం పేరుతో మోసం చేసే పార్టీ కాదు. ప్రజా పాలన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రోటోకాల్ విషయంలో నిన్న ప్రశాంత్ రెడ్డి ప్రవర్తించిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ప్రోటోకాల్ విషయంలో ఏ విధంగా ప్రవర్తించరో చూసుకోవాలి. అధికారిక కార్యక్రమంలో మీ అనుచరులతో టిఆర్ఎస్ నాయకులతో చెక్కులు పంపిణీ చేసినా మీరు ఇప్పుడు సరైన ప్రోటోకాల్ తో కార్యక్రమం నిర్వహిస్తుంటే లేనిపోని రాద్దాంతం చేసి మంత్రి ని అవమానించిన తీరు సరైనది కాదు. పోలీసులు లాటి చార్జి చేశారని ప్రశాంత్ రెడ్డి చెప్తున్నాడని గతంలో భీంగల్ కేంద్రంగా యువకులు తమ బాధలు చెప్పుకోవడానికి వస్తే బూటు కాలుతో తన్నిన చరిత్ర ప్రశాంత్ రెడ్డిది .నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులను టిఆర్ఎస్ గుండాలు కొట్టడానికి వస్తే అడ్డుగా నిలిచి రక్షణగా ఉన్న పోలీసులను ట్రాన్స్ఫర్ చేయించిన చరిత్ర ప్రశాంత్ రెడ్డిది. మరొకసారి ఇలాంటి ఘర్షణల సంఘటనలకు పాల్పడితే గ్రామ గ్రామాన ప్రశాంత్ రెడ్డిని తిరగకుండా అడ్డుపడతామని తీవ్రంగా హెచ్చరించారు.