
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 04 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు
మండలంలోఈరోజు పేగ పంచాయతీ సూరకుంట గ్రామంలోని తోడం చంద్రయ్య పటేల్ మరియు సోయం అర్జున పీసా కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పేగ పంచాయతీ నుండి 8 గ్రామాల పూజారి పెద్దలు, యూత్ హాజరు కావడం జరిగింది ఈ సమావేశానికి ఆదివాసీ జేఏసీ డివిజన్ కమిటీ సభ్యుల సర్పంచ్ పాయం చంద్రయ్య,మరియు ఆదివాసీ జేఏసీ ప్రచార కార్యదర్శి సోడి.శ్రీను మాట్లాడుతూ ఛలో చింతూరు నవంబర్ 16 వ తేదీన చింతూరు లో యువగలం భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చెయ్యాలని,ప్రభుత్వం ఉద్యోగ నియామక చట్టం చేసే వరకు ఈ పోరాటం ఆపకూడదని కోరారు , ఆదివాసీ ప్రాంతాల్లో ఉద్యోగాలు , హక్కులు ,1/70 లాంటి బలమైన చట్టాలను అమలు పరచటం లో ప్రభుత్వం విఫలమైంది, ప్రభుత్వం గతంలో జీ ఓ నంబర్ 3 కి బదులుగా వేరే చట్టం తీసుకొచ్చి న్యాయం చేస్తామని మాయమాటలు చెప్పారు అన్నారు.TAC తీర్మానం చేసి ఉద్యోగ నియామక చట్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి పేగ పంచాయతీ నుండి ప్రతి గ్రామంలో కుటుంబానికి ఒక్కరు చొప్పున స్వతహాగా కదిలి వెళ్ళలని పిలుపు ఇవ్వడం జరిగింది.యావత్ ఆదివాసీ మొత్తం కూడా సభను విజయవంతం చేయాలి అన్నారు ఈ కార్యక్రమానికి ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ చింతూరు డివిజన్ ప్రచార కార్యదర్శి సోడే శ్రీను, పీసం పొద్దయ్య, తోడం సుబ్బరాజు, అల్లిగూడెం పూజారి పోడియం వెంకటేష్ , పేగ గ్రామ పూజారి సోడే ధూళయ్య, సోడే సీతయ్య , నూప కోటేశ్, కలిగుండ గ్రామ పటేల్ సీతయ్య, వంకగూడెం పటేల్ ముద్దరాజు, వెంకటేష్, అశోక్, మలం పేట యూత్ నుండి శంకర్ , నారకొండ గ్రామ యూత్ , నర్సింగ పేట యూత్ రఘు కుంజ , ఆర్ ఓ ఎఫ్ ఆర్ కమిటీలు మరియు సూరాకుంట గ్రామస్థులు హాజరు కావడం జరిగింది…
