//పయనించే సూర్యుడు //జులై 10//
తెలంగాణ జనసేన పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో స్థానిక యువకులు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చిమక్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ కలాల్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో స్వచందంగా పార్టీ కండువా కప్పుకున్నారు కొత్తగా పార్టీలో చేరినవారు,బి.శివ,బి.ఆనంద్,ఎల్ .సురేష్ ,కె ఆనంద్,ఎమ్ అనిల్ ,ఎల్ బసవరాజ్ , బి.రవి ,ఎల్.అంజి ,బి.పరుశురాం ఎం.మల్లేష్,తాయప్ప తదితరులు సమాజం లో గొప్ప మార్పు తీసుకరావాలని తమ వంతుగా స్వచందంగా ఈ రోజు జనసేన పార్టీలోకి మక్తల్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కలాల్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో వారిని పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ జనసేన పార్టీ తెలంగాణలో కూడా బలంగా ముందుకు వెళ్తుంది మన వంతుగా పవన్ కళ్యాణ్ కోసం ఆయన రాష్ట్రం కోసం దేశం కోసం పడుతున్న తపన ఆయన కష్టపడుతున్న కష్టానికి మనం కూడా కొద్దిగా అయినా భాగస్థులు అయి నవ సమాజ నిర్మాణం కోసం పని చేయాలని అభిమాని గా ఉండడం కాదు కార్యకర్త గా మారి పార్టీ కోసం పని చేయాలని రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు విద్యావంతులు యువకులు మహిళలు పార్టీ లకు అతీతంగా యువత పెద్ద ఎత్తున జనసేన పార్టీ వైపు చూస్తూంది
జనసేనపార్టీ యువతకి సరికొత్త ఆయుధంగా మారనుంది ఇప్పుడు ఉన్న యువతకి ఇది ఒక మంచి అవకాశంలా భావించి ఇంకా చాలా మంది పార్టీ లోకి రావాలని డాక్టర్ మణికంఠ గౌడ్ పిలుపునిచ్చారు కొత్తపల్లి గ్రామ యువకులు పార్టీ ఎదుగుదల కోసం ఎలావెల కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు,లోకపల్లి భీమేష్ ,శివ ప్రసాద్ ,భీమషేన టేకులపల్లి , యాదగిరి వెంకటరెడ్డి,శ్రీను,టప్ప పవన్,కె పరుశురాం,అంజప్ప గౌడి బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు