పయనించే సూర్యుడు న్యూస్: రామగిరి, సెంటినరీ కాలనీ -01: జనవరి నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.వారు మాట్లాడుతూ జనవరి నెలలో ఆర్.జి-3 ఏరియాకు నిర్దేశించిన 5.88 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 5.84 లక్షల టన్నులు అనగా 99 శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు, నిర్దేశించిన 45.10 లక్షల క్యూబిక్ మీటర్ల ఓ.బి(మట్టి)వెలికితీత లక్ష్యానికి గాను, 43.01 లక్షల క్యూబిక్ మీటర్లు అనగా 95 శాతం ఓ.బి (మట్టి) వెలికి తీయడం జరిగిందని, అదేవిధంగా 6.67 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు.తదుపరి గనులవారిగా ఉత్పత్తి వివరాలను తెలియజేస్తూ నవంబర్ నెలలో ఓ.సి.పి-1 గనికి నిర్దేశించిన 3.28 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 3.09 లక్షల టన్నులు అనగా 94 శాతం, ఓ.సి.పి-2 గనికి నిర్దేశించిన 2.60 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 2.74 లక్షల టన్నులు అనగా 105 శాతం బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు.అందుకు కృషి చేసిన ఉద్యోగులందరికి వారు అభినందనలు తెలియజేశారు. భవిషత్తులో కూడా లక్ష్యానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయడానికి తగిన చర్యలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని కోరారు.ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను భద్రత తో సాధించడానికి కృషి చేయాలన్నారు.