నివాళులుపయనించే సూర్యుడు ఏప్రిల్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
మంగళగిరి సి.కె కన్వెన్షన్ హాల్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అమరులకు నివాళులు కార్యక్రమమునకు ఏపి ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పాల్గొని అమరులకు నివాళులు అర్పించారుఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున యాబై లక్షలు రూపాయలు విరాళం ప్రకటించి అనంతరం వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల మీద కనికరమవసరం లేదు నిర్దాక్షంగా చంపి వేయాలి. మన దేశానికి సహనము ఎక్కువైపోయింది అతి సహనం కూడ మంచిది కాదు, ఉగ్రవాదులు కేవలం హిందువులను టార్గెట్ చేసి చంపారు కొంతమంది నాయకులు ఇది మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోది పాకిస్తాన్ పై తీసుకుంటున్న నిర్ణయాలకి కుల, మతాల, పార్టీలకు అతీతంగా ఆసరాగా ఉండాలి అన్నారు.కొంతమంది నాయకులు టీవీ డిబేట్లో కూర్చొని పాకిస్తానీ ప్రేమిస్తున్నామన్నారు మీరు అంతగా ప్రేమిస్తే పాకిస్తానికే వెళ్లిపోవాల్సిందే అని అన్నారు.భారతదేశంలో ఉండాలి అంటే వందేమాతరం పాడాల్సిందే ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధా రాం రాజలింగం, కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మరియు రాష్ట్ర నాయకులు పాల్గొని అమరులకు నివాళులు అర్పించారు.