పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు అనే నిబంధన ఎత్తివేయాలి
పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ. 15వేల రూపాయలకు పెంచాలి
శాసనమండలిలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
( పయనించే సూర్యుడు మార్చి 27 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీలలో వార్డుల సంఖ్యను పెంచాలని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి రాష్ట్ర శాసనమండలిలో ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను శాసనమండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గ్రామపంచాయతీల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి అనే నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇద్దరు పిల్లలు అనే అంశాన్ని ప్రభుత్వం ప్రకటించక ముందుకే ఆయన టీవీల్లో చెప్పడం వల్ల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇద్దరు పిల్లల ప్రస్తావనను తేవడం లేదని ప్రచారం జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గ్రామపంచాయతీలలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య నిర్వహణ కార్మికుల వేతనాలు రూ. 15 వేలకు పెంచాలని, కార్మిక జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడాలని కోరారు. నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీలకు రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని కోరారు.