పయనించే సూర్యుడు/జనవరి 17/ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్: మండల పరిధిలోని జన్నారం గ్రామంలో ఈనెల 12వ తేదీ నుండి గురువారం వరకు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఐదు రోజులు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో ఏన్కూరు మండలం, తల్లాడ, కొనిజర్ల మండలాలకుసంబంధించినటీములు పాల్గొనడంజరిగింది మొదటి బహుమతి తల్లాడ మండలం గెలుపొందడం జరిగింది. రెండో బహుమతి జన్నారం కొత్తూరు టీం గెలుపొందడం జరిగింది, మూడో బహుమతి జన్నారం పాతూరు టీం గెలుచుకోవడం జరిగింది. గెలుపొందిన వారికి బహుమతులు తోపాటు సీల్డ్ అందజేయడం జరిగింది. ఈ పోటీలకు మొదటి బహుమతి శ్రీ రాఘవేంద్ర రియల్ ఎస్టేట్స్ శర్వనంద్ గౌడ్ హైదరాబాద్ వారు 15, 126=00 రూపాయలు, రెండో బహుమతి విశ్వ ఆగ్రోస్ ఖమ్మం వంకాయలపాటి సంజయ్ కుమార్ 10,116=00 రూపాయలు, మూడో బహుమతి గుడ్ల వెంకటేశ్వరరావు, (G.V.R) ఏన్కూర్ వారు 5116=00 అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు నరేష్ జాదవ్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు, జన్నారం మాజీ ఉపసర్పంచ్ అడపా రామారావు, సొసైటీ డైరెక్టర్ పులబాల నరసింహారావు, బత్తిని కొండయ్య, సిపిఐ పార్టీ నాయకులు పొన్నం రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.