బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి..
మర్యాదపూర్వకంగా కలిసిన పూల మొక్కను అందజేసిన సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్..
పయనించే సూర్యడు, మే 24, కుమార్ యాదవ్, హుజురాబాద్ అర్ సి )
జమ్మికుంట పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్ శుక్రవారం నాడు జమ్మికుంట మండల నూతన తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన వెంకట్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని సర్వే నంబర్ 887,626 లో కొంతమంది దళారులు దొంగ పట్టాలు సృష్టించి క్రయ విక్రయాలు చేస్తున్నారని, ప్రభుత్వ భూములను కాపాడావాల్సిన బాధ్యత తహసిల్దార్ పైనే ఉందని, విజ్ఞప్తి చేశానన్నారు. తక్షణమే స్పందించిన తహసిల్దార్ వెంకటరెడ్డి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు.