పయనించే సూర్యడు సిహెచ్.విద్యా సాగర్
దేవీపట్నం మండలం
ఫిబ్రవరి:-4
అల్లూరి సీతారామరాజు జిల్లా,రంప చోడవరం డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేయదలచిన రేల పండుగ ఆదిమ తెగల సాంస్కృతిక సాంప్రదాయ పండుగల సమ్మేళనం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేయడం జరిగిందని ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.కావున అధికారులు,ఆదివాసి పెద్దలు,పూజారులు,ప్రజాప్రతినిధులు,ఉద్యోగులు,ఆదివాసి ప్రజానీకం,కవులు,కళాకారులు,మేధావులు,మహిళలు,యువతీ యువకులు,మీడియా మిత్రులు అందరూ గమనించగలరని విజ్ఞప్తి చేశారు.మరల రేల పండుగ ఆదిమ తెగల సాంస్కృతిక సాంప్రదాయ పండుగల సమ్మేళనం ఎప్పుడు నిర్వహించేది తదుపరి తేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు.