
*టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కు వినతి*
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి: జిల్లా కేంద్రంతో మండల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పుప్పాల దేవిదాస్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టి డబ్ల్యూ జేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కు వినతి పత్రాన్ని అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడతానని హామీ ఇచ్చి ఇప్పటికీ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం సరికాదన్నారు చాలీచాలని వేతనాలతో జర్నలిస్టులు పనిచేస్తున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అర్హులైన పేద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు మంజూరు చేయించాల్సిందిగా కోరారు. అదేవిధంగా అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు తక్షణమే ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో టి. డబ్ల్యూ. జె. ఎఫ్. జిల్లా ప్రధాన కార్యదర్శి జావిద్ తో పాటు పలువురు పాల్గొన్నారు.