చండూరు మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన .
*సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ మండిపాటు .
*సాంబశివరావును భేషరతుగా విడుదల చేసి.. కేసులను ఎత్తివేయాలని డిమాండ్ .
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు సెప్టెంబర్ 16 .ఖమ్మం జిల్లాకు చెందిన జర్నలిస్ట్ సాంబశివ రావుపై అక్రమ కేసును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజగా చండూరు మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. సాంబశివరావును భేషరతుగా విడుదల చేసి.. అతనిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం లోని పిఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా కొరతతో రైతులు పడే కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వీడియో కవరేజ్ లో ఉన్న టీయూ డబ్ల్యూయుజె(టీజేఎఫ్) జాతీయ కౌన్సిల్ సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లాల "టి న్యూస్ ఛానెల్" ప్రతినిధి వెన్నబోయిన సాంబశివరావుపై అదేవిధంగా వీడియో జర్నలిస్టు,4జి కిట్ టెక్నీషియన్ లపై కొనిజర్ల మండల పోలీసులు పెట్టిన అక్రమ కేసులను పున పరిశీలించి తక్షణమే ఉపసంహరిం చుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జర్నలిస్టులపై న అకారణంగా పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. లేదంటే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల కు పిలుపునిచ్చేందుకు కార్యాచరణ చేస్తామని అన్నారు. ప్రభుత్వానికి,ప్రజలకు వారధిగా నిలిచే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు. కేసులు పెట్టి జర్నలిస్టుల స్వేచ్ఛను హరించడమేనని వారు తెలిపారు.