సీనియర్ జర్నలిస్ట్ అంబాల ప్రభాకర్ (ప్రభు)..
పయనించే సూర్యడు //జనవరి 30//హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
గత ప్రభుత్వం హుజరాబాద్ లో పనిచేస్తున్నటువంటి అర్హులైన జర్నలిస్టులకు సుమారు 70 మందికిపైగా నివేషణ స్థలాల పట్టాలు ఇచ్చి పొజిషన్ కూడా ఇవ్వడంతో ప్రభుత్వ అనుమతులు తీసుకొని లక్షలాది రూపాయలు వెచ్చించి ఇండ్లను నిర్మించుకొని, కరెంటు మీటర్ లు కూడా తీసుకొని హుజురాబాద్ మున్సిపాలిటీలోని గత రెండు సంవత్సరాలుగా గత రెండు సంవత్సరాలుగా మున్సిపల్ కార్యాలయం లో ఇంటి పన్ను కూడా కడుతూ వస్తున్న తరుణంలో ఓర్వలేని ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు జర్నలిస్టులకు ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన స్థలాలపై కోర్టులో కేసు వేయగా ఆ సమస్య నేటికీ పరిష్కారం కాక పోవడంతో అర్హులైన జర్నలిస్టులు అందరూ గత నాలుగు రోజులుగా హుజూరాబాద్ పట్టణ కేంద్రంలో వినూత్న రీతిలో నిరసనలు తెలిపినప్పటికీ ప్రజా ప్రతి నిధులు అధికారులు స్పందించకపోవడంతో గురువారం హుజూరాబాద్ ప్రతిభ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పరిష్కారం కోసం సీనియర్ జర్నలిస్ట్ అంబాల ప్రభాకర్ ప్రభు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ (ప్రభు)
మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ చొరవ తీసుకొని కోర్టులో ఉన్నటువంటి అట్టి వివాదాన్ని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల జిల్లాలలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులను ఏకం చేసి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో
ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనర్ లు కాయిత రాములు, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సుద్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక, బిఆర్ఎస్ నాయకుడు గందే శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్ ,బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు , ప్రజాసంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, మార్త రవి, చందుపట్ల జనార్ధన్, మాజీ కౌన్సిలర్లు మారపల్లి సుశీల కళ్ళపల్లి రామాదేవి, ముత్యం రాజు తాళ్లపల్లి శ్రీనివాస్ , బిజెపి నాయకు లక్ష్మి,రాజు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.