
//పయనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్ 22// నారాయణపేట జిల్లా బ్యూరో //
PYL జిల్లా అధ్యక్షులు ప్రతాప్ ,ప్రధాన కార్యదర్శి సిద్దు మాట్లాడుతూ నారాయణపేట జిల్లా కేంద్రంలో విద్యార్థుల బస్సుల కోసం ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకుల మీద, వార్తలు కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుల మీద, ఆర్టీసీ వారు పెట్టిన అక్రమ కేసుల ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు నారాయణపేట జిల్లా ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రతాప్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దు, విద్యార్థులు బస్సుల కోసం నిరీక్షిస్తున్న విద్యార్థుల తరఫున వారికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల సంఘం నాయకులు PDSU SFI ABVP మరియు విద్యార్థి సంఘాల నాయకులు వారికి బస్సు సౌకర్యం కల్పించాలని శాంతియుతంగా ధర్నా చేస్తున్నారని కనీసం విద్యార్థుల దగ్గరికి వచ్చి ఆర్టీసీ వారు మాట్లాడాలని డిమాండ్ చేస్తే కనీసం మర్యాద ఇవ్వకుండా ఇలా అక్రమ కేసులు నమోదు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు,ఆర్టీసీ అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు,ఇప్పటికీ ఆర్టీసీ డిపో అధికారులమీద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ఉందని అనేక ఆరోపణలు ఉన్నాయి , ఇవి మార్చుకోపొగ మళ్లీ వారి మీద కేసులు పెట్టడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు, అలాగే సమాజంలో జరుగుతున్న మంచి చెడు విషయాలను విద్యార్థి సమస్యలను ప్రభుత్వ సమస్యలను అన్ని సమస్యలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లి. వివరించగలుగుతున్న జర్నలిస్టుల మీద అక్రమంగా కేసులు నమోదు,చేయడం మరి దారుణమని అన్నారు, ఆర్టీసీ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడ్డమే కాదు ఇలా జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అంటే వారి హక్కుల్ని కాలరాయడమే అని అన్నారు, ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వీడి విద్యార్థులకు బస్సు సౌకర్యాలు కల్పించాలని, వార్తలు కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుల మీద అక్రమ కేసులు బనాయించడం అంటే వారు చేస్తున్న విధుల పట్ల నిర్లక్ష్యం కప్పి పుచ్చుకోవడానికి అని స్పష్టంగా కనబడుతుందని అన్నారు,ఇప్పటికైనా విద్యార్థి సంఘాల నాయకుల మీద జర్నలిస్టుల మీద పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని లేకపోతే ప్రగతిశీల యువజన సంఘం సంఘం ఆధ్వర్యంలో వారికి మద్దతు ఉంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం కాదు ఆర్టీసీ డిపోను కూడా ముట్టడిస్తామని వారు హెచ్చరించారు,