ప్రభుత్వ యంత్రాంగం జర్నలిస్టుల పట్ల వివక్షపూరితమైన వైఖరి వీడాలి.
జర్నలిస్టులకు అండగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF)
రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని శాంతినికేతన్ హైస్కూల్లో జర్నలిస్టు ల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్ హాజరై మాట్లాడుతూ జర్నలిస్టులు అందరూ ఐక్యతతో ఉండాలనీ కొంతమంది అక్రిడేషన్ లేదనే పేరుతో వివక్ష చూపడం సరైనది కాదని ఇది చట్ట వ్యతిరేకమైన చర్యఅని. జర్నలిస్టును గుర్తించడం అంటే భారత ప్రభుత్వం ఆమోదించిన పత్రిక గుర్తింపు కార్డు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని అన్నారు. అక్రిడేషన్ అనేది ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకంలో భాగంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇలా కాకుండా అక్రిడేషన్ లేదనే పేరుతో జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ అధికారులు,సహజర్నలిస్టులు వివక్ష చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని అన్నారు .జాతీయ కౌన్సిలర్ నెంబర్ గద్దెగూడెం యాదన్న మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతి జర్నలిస్టుకు అండగా ఉంటుందనీ ,ప్రభుత్వం జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగస్వామ్యం ఉండాలని డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .అలాగే జర్నలిస్టులపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం ముందు వరసలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా సెక్రెటరీ మహదేవ్, జిల్లా బ్రాడ్ కాస్టింగ్ ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, అబ్దుల్ సాలెం, క్షీరానంద్ లక్ష్మణ్.a వెంకటయ్య. బి విశ్వనాథ్. సీ.తిమ్మప్ప. శీను.బాలరాజ్, సిద్దు, మ్యాతరీ గోపాల్, జంషీర్ అలీ, నవీన్ కుమార్, నాగేంద్ర, లక్ష్మణ్, జంషీర్ హలీ తదితరులు పాల్గొన్నారు.