
టిడబ్ల్యుఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేరీబాయి గణేష్, మైల సైదులు
జర్నలిస్ట్ తక్కళ్ళపల్లి రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించిన టిడబ్ల్యూజెఎఫ్
( పయనించే సూర్యుడు డిసెంబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
తలకొండ పల్లి మండల సీనియర్ జర్నలిస్టు కీర్తిశేషులు తక్కళ్ళపల్లి రాజేందర్ కుటుంబాన్ని గురువారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) నాయకులు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తక్కళ్ళపల్లి రాజేందర్ స్వగృహానికి వెళ్ళిన టిడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గణేష్ శేరీబాయి, మైల సైదులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండి ఖాజాపాషా కేపీ, జిల్లా ప్రచార కార్యదర్శి నరసింహ రెడ్డి, షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, తలకొండపల్లి జర్నలిస్టులు శంకర్, తిరుపతయ్య, శ్రీను, అమన్ గల్ విలేకరి శేఖర్ తదితరులు రాజేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తండ్రి కృష్ణయ్య,రాజేందర్ సతీమణి రమాదేవి, కూతురు జెస్సికా, కుమారులను వారు పరామర్శించారు. రాజేందర్ జర్నలిస్టు వృత్తిలో ఎంతో మెరుగైన పాత్ర పోషించారని ఈ సందర్భంగా ఆయన సేవలను టిడబ్ల్యూజేఎఫ్ కొనియాడింది.రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక భూమిక నిర్వహించారని, కల్వకుర్తి నియోజకవర్గంలో అనేకమందికి తలలో నాలుకలా వ్యవహరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజేందర్ కుటుంబానికి టిడబ్ల్యూజేఎఫ్ సంఘం అండగా నిలుస్తుందని తెలిపారు. విద్య, వైద్య తదితర విషయాలలో అతని కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. జర్నలిస్టుకు రావాల్సిన ప్రభుత్వం సంక్షేమ నిధి తదితర విషయాలలో ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించేందుకు కూడా యూనియన్ కృషి చేస్తుందని తెలిపారు. ఎంతోమంది నాయకులతో ప్రజాప్రతినిధులతో రాజేందర్ కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజేందర్ కుటుంబానికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ తరఫున చెక్ ను అందజేశారు.
