పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధిపొనకంటి ఉపేందర్ రావు
టేకులపల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 6 గ్యారంటీ లను అమలు పరచే విషయంలో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. జాతిపిత మాత్మ గాంధీ కి శిరస్సు వంచి వందనాలు ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించు ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు ఓ మహాత్మా మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి మీ ఆశయాల స్ఫూర్తిగా టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రగతి పథంలో నడిపించాం సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలకు శ్రీకారం చుట్టాం తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా సమున్నతంగా మార్చి దేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా జనవరి 30న 420 రోజులు పూర్తి చేసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు ఎన్నికల్లో వంచించి గ్యారెంటీ కార్డుకు ఇచ్చిన 420 హామీలకు పాత రేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెల్లదీస్తున్నారు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవికాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది డిక్లరేషన్ పేరుతో హామీల పేరుతో గ్యారెంటీ ల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 420 రోజులైనా హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రోజు ముందే హామీలపై రకరకాల సాకులతో కాలం వెళ్లదీస్తూ కొన్ని పథకాలకు ఏవేవో కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారుఈ కార్యక్రమంలో BRS మండల అధ్యక్షులు బొమ్మెర వరప్రసాద్ ప్రధాన కార్యదర్శి బోడ బాలు pacs చైర్మన్ లక్కీనేని సురేందర్ రావు , చీమల సత్యనారాయణ,కుమ్మరి కిరణ్, m ఫూల్ సింగ్,A లక్పతి,v వెంకన్న,g లక్ష్మ నాయక్,బల్లెం సురేష్,m రవి,k కుమార్ తదితరులు పాల్గొన్నారు