//పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి8 మక్తల్శు క్రవారం మక్తల్ మండలం మంతన్ గోడ్ గ్రామానికి చెందిన C అనూష మంతెనగోడు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది నారాయణ పేట జిల్లా కేంద్రంలో గత నెలలో జనవరి 25వ తేదీన నిర్వహించినటువంటి జాతీయ ఓటర్ దినోత్సవం లో ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను చాలా చక్కగా ఉపన్యాసంలో వివరించినందుకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా మొదటి బహుమతి సాధించింది ఇంత చిన్న వయసులో ఓటు హక్కు గురించి ఓటు యొక్క ప్రాముఖ్యతను ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి అనే విషయాల పట్ల అవగాహన కలిగి ఉన్నందుకు ధర్మ సమాజ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ యువకులు విద్యార్థులు ఓటు హక్కు గురించి అవగాహన కలిగి ఉండి చదువుకొని తమ తల్లిదండ్రులకు ఓటు హక్కు ఒక ప్రాముఖ్యతను తెలియజేసే బాధ్యత తమపై ఉందని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు తెలియజేసారు అనూష ను ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు ముందు ముందు ఎన్నో సాధించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు గువ్వల శివరాజ్ మహా రాజ్ జిల్లా నాయకులు దశరత్ అడ్వాకెట్ శ్యామ్ కుమార్ పీ.డీ ఆంజనేయులు మహారాజ్ దినేష్, నాగేష్ వెంకటేష్, మల్లేష్, రాజు, దయానంద్,నరసింహ, నరసన్న, శివాజీ మహారాజ్ గువ్వల తిరుపతి, అనూష తల్లిదండ్రులు పాల్గొన్నారు