పయనించే సూర్యుడు, అక్టోబర్ 13( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ . ఆదేశాలమేరకు జాతీయ బీసీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులుదండు వినోద్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎగుర్ల ప్రశాంత్ మాట్లాడుతూ దీనికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ మరియు నాపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించినందుకు జాతీయ అధ్యక్షులు శ్రీ ఆర్ కృష్ణయ్య ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్ల అసెంబ్లీ ఇంచార్జ్ గా అన్ని రకాల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి బీసీల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి బీసీలకు రావాల్సిన వాటాల్ని తీసుకునే వరకు పోరాటం చేయబడుతుందని తెలిపారు. ఈ నియామకం సిరిసిల్ల నియోజకవర్గ సభ్యుల యొక్క సంయుక్త నియామకంగా భావిస్తున్నానని తెలిపారు.