పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 21:రిపోర్టర్( కే శివ కృష్ణ ) బాపట్ల జిల్లా,చెరుకుపల్లి మండలం కావూరు గ్రామం జాతీయ రహదారి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేపల్లె నుండి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడగా 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి నగరం మండలం పెద్దమట్లపూడి గ్రామ పంచాయతీ లుక్క వారి పాలెం గ్రామానికి చెందిన ఆట్ల దుర్గాప్రసాద్(25) గా గుర్తించారు..