ఎన్ హెచ్ 216 కుందేరు వైపుకు బైపాస్ నిర్వహించాలని కోరుతూ గురువారం వెదుళ్ళపల్లి సెంటర్లో సమావేశం జరిగింది..
పులిపాక హరిప్రసాద్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించి బాపట్ల ఇంజనీర్ కళాశాల వద్ద ఉన్న బైపాస్ రోడ్డు ను
కుందేరు వైపు నుండి ఈపూరుపాలెం వరకు ఉన్న బైపాస్ రోడ్ లో కలపాలని కోరారు..
పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 28:- రిపోర్టర్ (కే శివకృష్ణ )
జాతీయ రహదారి 216 వెదుళ్ళపల్లి గ్రామ మధ్యలో పోవుచున్న నేపథ్యంలో 3 ఏళ్ళ క్రితమే ఈ రహదారిని 3 రోడ్ల గా విశాల పరిచారు. ఊరి మధ్యలో కాకుండా పక్కనే ఉన్న కుందేరు వైపుకు డైరెక్షన్ చేయాలని కోరుతూ గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఉపరితల రవాణా శాఖ మంత్రి వినతి పత్రం అందజేయడం జరిగింది. అప్పటికే రోడ్లు వేశారు గాని మధ్యలో డివైడర్లు నిర్మించకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగాయి.ఇదిఇలాఉండగా మరల ఎన్ హెచ్ 216 కు 4 రోడ్లుగా మరింత విస్తరించాలని వచ్చిన వార్తల నేపథ్యంలో వెదుళ్ళపల్లి పరిసర పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు .ఊ నేపధ్యంలో బేతపూడి శివాలయం వద్ద వివిధ గ్రామాల పెద్దలు సమావేశం గురువారం జరిగింది. వెదుళ్ళపల్లి గ్రామ మధ్య లో వెళుతున్న ఎన్ హెచ్ 216 జాతీయ రహదారిని ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్న బైపాస్ రోడ్డు నుంచి కుందేరు పక్కనుండి ఈపూరుపాలెం బైపాస్ రోడ్ లో కలపాలని, ప్రస్తుతం వెదురుపల్లి గ్రామ మధ్యలో వెళ్లిన రహదారికి మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ వెదుళ్ళపల్లి పరిసర గ్రామాల పెద్దలు తీర్మానించడం జరిగింది. 216 జాతీయ రహదారి రోడ్డు 4 రోడ్లుగా విస్తరణ జరిగితే తీవ్ర సమస్యలు వస్తాయి. జడ్పీ హైస్కూల్ వెదుళ్ళపల్లి పాఠశాలలు, దేవాలయాలు, చెర్చీలు , వెదుళ్ళపల్లి బేతపూడి స్టువర్ట్పురం గ్రామాలలోని
లు పేదల నివాస గృహాలు వ్యాపారస్తులు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమావేశానికి పులిపాక హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాగాల చిన కోటేశ్వరావు, అన్నం భాస్కర్, సాతులూరి నాగేశ్వరరావు, డాక్టర్ స్వరల హనుమంతరావు, డాక్టర్ ఆంజనేయ చారి ,డివి రమణయ్య , అక్కల చిన్న వెంకటేశ్వర్లు, నాయుడు బ్రహ్మచారి, పోకూరి సుబ్బారావు, పోకూరి ప్రసాద్, నంబూరివెంకటేశ్వర్లు
చౌట భాస్కర్, చిన్న బోతుల రత్నాకర్, వెదుళ్ళపల్లి గ్రామాల సమైక్య అధ్యక్షులు కోట వెంకటేశ్వర రెడ్డి రాగాల వెంకటరావు, మచ్చ సాహెబ్ రెడ్డి,
కే నాగిరెడ్డి, ఆసోది చిన్నపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.