(సూర్యుడు సెప్టెంబర్ 24 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో జాతీయ సేవ పథకం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డెంటల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. శ్రీనివాస సూపర్ స్పెషలిస్ట్ దంత వైద్యశాల వైద్య శిబిరం ఈరోజు దొమ్మాట గ్రామంలోని ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరంలో భాగంగా డాక్టర్ ఎల్. శ్రీనివాస్ ఎండి డెంటిస్ట్ శ్రీనివాస్ డెంటల్ హాస్పిటల్ సిద్దిపేట గారిచే డెంటల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ఎం మంగత నాయక్ మరియు ఎం. సంపత్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సహకారంతో నిర్వహించడం జరిగింది .ఇందులో రామ భజనందరం తమ యొక్క కంటి పరీక్షను చేయించుకొని ఆనంద వ్యక్తం చేస్తూ ధన్యవాదములు తెలిపారు. ఇందులో పాల్గొన్నవారు ఎన్ ఎస్ ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ చైర్మన్ మధు శ్రీనివాస్ మరియు పోగ్రాo ఆఫీసర్ ఎం. నాయక్. సంపత్ కుమార్ పాల్గొనడం జరిగింది