
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ - త్రిబుల్ ఐటీ బాసర, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థుల బృందం 'టీమ్ గరుడ' జాతీయ స్థాయిలో నిర్వహించిన రెండు ప్రతిష్టాత్మక పోటీల్లో అద్భుత విజయాలను నమోదు చేసి విశ్వవిద్యాలయ కీర్తిని చాటిచెప్పింది. 2వ, 3వ మరియు 4వ సంవత్సరం చదువుతున్న 30 మంది విద్యార్థులతో కూడిన ఈ బృందం, తమ స్వహస్తాలతో రూపొందించిన ఆల్-టెర్రైన్ వెహికల్ (ఎ.టి.వి.) తో ఈ ఘనత సాధించింది.ఎం -బి. ఎ.జి. ఎ. ఎస్.ఎ.ఇ. ఇండియా2026 లో సత్తా చాటింది.
మార్చి 27 నుండి 31 వరకు నర్సాపూర్‌లోని బి.వి.ఆర్.ఐ.టి లో జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 55 జట్లు పాల్గొన్నాయి. మొదటి ప్రయత్నంలోనే టీమ్ గరుడ డిజైన్ ఇంజనీరింగ్ విభాగంలో ఆల్ ఇండియా 3వ ర్యాంక్ కైవసం చేసుకుంది. ఇంజనీరింగ్ డిజైన్, సిమ్యులేషన్, ఛాసిస్ ఫ్యాబ్రికేషన్ మరియు టెక్నికల్ ప్రెజెంటేషన్‌లో విద్యార్థులు చూపిన ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది.ఎ.టి.వి.సి. ఇండియా 2026 లో ఛాంపియన్‌గా ఆవిర్భావం ఫిబ్రవరి 25 నుండి మార్చి 1 వరకు అహ్మదాబాద్‌లోని మోనార్క్ యూనివర్సిటీలో జరిగిన ఈ పోటీల్లో 43 జట్లు పోటీ పడ్డాయి. ఇక్కడ టీమ్ గరుడ అసాధారణ ప్రతిభను కనబరిచి రెండు ప్రధాన అవార్డులను సొంతం చేసుకుంది.డిజైన్ ఎవాల్యుయేషన్ విభాగంలో ఆల్ ఇండియా 1వ ర్యాంక్ (విన్నర్స్).
బెస్ట్ మోటివేటెడ్ టీమ్ అవార్డు గెలుచుకుంది.అడ్మినిస్ట్రేషన్, అధ్యాపకుల అభినందనలు.
ఈ అద్భుత విజయంపై విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ స్పందిస్తూ, "తక్కువ సమయంలోనే జాతీయ స్థాయిలో ఇలాంటి గుర్తింపు రావడం విద్యార్థుల అంకితభావానికి, ఆవిష్కరణలకు నిదర్శనం. ఇది భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం" అని కొనియాడారు.ఓ ఎస్ డి. ప్రొఫెసర్ ఇ. మురళీ దర్శన్ మాట్లాడుతూ, ప్రయోగాత్మక అభ్యాసం వల్ల ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. అసోసియేట్ డీన్లు డాక్టర్ కె. మహేశ్, మిస్టర్ శేఖర్ శీలం, డాక్టర్ ఎస్. విట్టల్, మెకానికల్ హెచ్.ఓ.డి మిస్టర్ ఎ. చరణ్ రెడ్డి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు మిస్టర్ అన్పత్ రాహుల్, డాక్టర్ కె. మహేశ్ విద్యార్థుల కృషిని ప్రశంసించారు.తమ విజయానికి సహకరించిన యూనివర్సిటీ యాజమాన్యానికి, ఫ్యాకల్టీ మెంటర్లకు, స్పాన్సర్లు అయిన స్నేహ హస్తాలు, పరి ఫౌండేషన్, లార్వెన్ ఎ.ఐ.స్టూడియో, సంచారి, లయన్స్ క్లబ్, డి.ఎస్. సాలిడ్ వర్క్స్ వారికి టీమ్ గరుడ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
