పయనించే సూర్యుడు గాంధారి 09/02/25 స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే 6 వారాల క్రీడ శిక్షణలో భాగంగా గాంధారి మండల పెట్ సంగం గ్రామ పంచాయతీ పరిధిలోని ధన్ సింగ్ తండాకు చెందిన జరప్లా సోనియా ఈ నెల 10 నుండి 25 వరకు బెంగుళూర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్రీడా ప్రాధికార సంస్థ లో నిర్వహించే శిక్షణ కూ ఎంపిక అయింది వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి అయిన సోనియా ఇటీవలే వ్యాయామ విద్య పూర్తి చేసింది, జాతీయ స్థాయి కోచ్ కావడమే లక్ష్యం అని ఆమె పేర్కొన్నారు