పయనించే సూర్యుడు న్యూస్ చండూరు సెప్టెంబర్ 14 : కస్తాల గ్రామపంచాయతీ తాజా మాజీ వార్డు సభ్యులు జాల కీర్తన మామ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాల రామకృష్ణ తండ్రి జాల పెద్ద నరసింహ ఈరోజు తెల్లవారుజామున పరమపదించినారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి పూలమాలవేసి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, సింగిల్ విండో వైస్ చైర్మన్ గుండమల్ల శ్రీనివాసులు, గ్రామ శాఖ అధ్యక్షులు దోటి శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ గుండమల్ల వెంకటేశం, మాజీ సర్పంచులు బొమ్మరబోయిన వెంకటేశం, మెండు వెంకటరెడ్డి, మెండు బ్రహ్మానందరెడ్డి, గాలెంక రాంబాబు, జాల వెంకటేశం, నాతాల రంగారెడ్డి, బొమ్మరబోయిన యాదగిరి, కట్ట సైదులు, జిల్లా శివ, కట్ట రమేష్, కొల్లు మల్లారెడ్డి, జాల శంకర్ ,జాల రామచంద్రు, తదితరులు పాల్గొని నివాళులర్పించడం జరిగింది.