( పయనించే సూర్యుడు ఏప్రిల్ 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్)
జిపి కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఫరూక్నగర్ ఎంపీడీవో కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టంగుటూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ జిపి కార్మికులకు రెండు నెలల వేతనాలు మాత్రమే అకౌంట్లో వేశారని మరో మూడు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని వెంటనే వేయాలని ఆయన ఎంపీడీవో ను కోరారు జిపి కార్మికులకు పిఎప్ ఈఎస్ఐ లేదు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేదు వెంటనే వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని జిపి కార్మికులకు పర్మనెంట్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆయన అడిగారు గ్రామపంచాయతీ కార్మికులుగా ఎస్సీ ఎస్టీలు మాత్రమే పనులు చేస్తున్నారు కానీ వారికి పనికి తగ్గ వేతనం లేదని 26 వేల కనీస వేతనాన్ని అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు ఎంపీడీవో గారు మాట్లాడుతూ మీరు పెట్టిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతానని త్వరగా మా పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించి మిగతావన్నీ కూడా ప్రభుత్వ పరిధిలోవి కాబట్టి వాటిని ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య శాతవి డివిజన్ ఉపాధ్యక్షులు
కె రాజు నాయక్ శంకర్ నాయక్ జిపికార్మికులు తదితరులు పాల్గొన్నారు.