
జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేనినా
పయనించే సూర్యుడు నవంబర్ 27 (పొనకంటి ఉపేందర్ రావు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో దివ్యాంగుల ఆటల పోటీలు నవంబర్ 29 శనివారం న ప్రగతి మైదానం, బూడిద గడ్డ కొత్తగూడెం నందు నిర్వహించడం జరుగుతుంది. జూనియర్ కేటగిరి 18 సంవత్సరాల లోపు, సీనియర్ కేటగిరి 18 నుంచి 54 సంవత్సరాల లోపువారుఅర్హులు.కేటగిరి(బాలలు/బాలికలు, పురుషులు/మహిళలు) వారిగా అంధులకు - షార్ట్ పుట్, రన్నింగ్, చెస్. బధిరులకు - షాట్ పుట్, జావేలిన్ త్రో, రన్నింగ్. శారీరక దివ్యాంగులకు - షాట్ పుట్, జావెలిన్ త్రో, క్యారం.ఇంటలెక్చువల్ డిసేబులిటీ - షార్ట్ పుట్, రన్నింగ్ క్రీడలు నిర్వహించబడును.ఈ క్రీడలలో మొదటి స్థానంలో నిలిచిన వారికి దివ్యాంగుల సంక్షేమ శాఖ హైదరాబాద్ వారు ప్రత్యేక స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణనిచ్చి, రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొనేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కావున జిల్లాలోని ఆసక్తి కలిగిన దివ్యాంగ క్రీడా కారులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనినా పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. ఇతర వివరాలకు 6301981960, 8331006010 సంప్రదించగలరు.
జిల్లా సంక్షేమ అధికారిణి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా