
డైరీ, క్యాలెండర్ లోని వినూత్న అంశాలను అభినందించిన కలెక్టర్
// పయనించే సూర్యుడు// //న్యూస్ జనవరి 14//
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TPUS) నారాయణపేట జిల్లా శాఖ డైరీ ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఫణి కుమార్ లు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా డైరీలో పొందుపరిచిన అంశాలు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని తెలిపారు.నూతన క్యాలెండర్ లో విద్యారంగ పరిరక్షణ,ఉపాధ్యాయుల సంక్షేమం
కోసం తపస్ చేస్తున్న కృషిని చిత్రాలతో పొందుపరిచిన అంశాలను కలెక్టర్ కు జిల్లా శాఖ పక్షాన వివరించగా వారిని కలెక్టర్ అభినందించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహ, రవీందర్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి షేర్ కృష్ణారెడ్డిలు విద్యా వ్యవస్థ పటిష్టతకు ఇంకా మెరుగ్గా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుంపు బాలరాజ్, మక్తల్ మండల అధ్యక్షులు నర్సింలు, తపస్ నాయకులు కృష్ణారెడ్డి రాజ ఆంజనేయులు, ప్రవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
