పయనించే సూర్యుడు న్యూస్(సెప్టెంబర్.27/09/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలానికి చెందిన వైఎస్ఆర్సిపి నేత ఓడూరు ఉజ్వలరెడ్డిని జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా నియమిస్తూ వైఎస్ఆర్సిపి తాడేపల్లి కేంద్ర కార్యాలయం పత్రిక ప్రకటన విడుదల చేసింది ఈ నియామకం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగినట్లు అందులో పేర్కొంది ఈ నియామకం పట్ల ఉజ్వలరెడ్డి మాట్లాడుతూ మొదటగా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మద్దెల గురుమూర్తి సత్యవేడు వైసిపి సమన్వయకర్త నూక తోటి రాజేష్ అలాగే నియోజకవర్గ వైసీపీ శ్రేణులు అందరికీ ఈ బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ నియామకం ద్వారా వైసిపిని విజయతీరాలకు చేర్చడంలో శక్తివంతం లేకుండా కృషి చేస్తానన్నారు.