పయనించే సూర్యుడు జనవరి 20(వాట్ పల్లి ప్రతినిది డి హనీఫ్)... సంగారెడ్డి జిల్లా స్థాయి లో నిర్వహించిన అబకస్ మరియు వేదిక్ మాథ్ పరీక్ష పోటీలో అక్షర స్కూల్, వట్పల్లి విద్యార్థులు బి. తారా దేవి ( వట్పల్లి ) , అనికేత్ గౌడ్ ( తాటిపల్లి ), స్ఫూర్తి ( భైరందిబ్బ ), హిమాన్ష్ ( వట్పల్లి ), జస్వంత్ ( గొర్రెకల్ ) రాష్ట్ర స్థాయి లో ఎన్నిక కావడం జరిగింది. ఈ ప్రోగ్రాం లో సంగారెడ్డి ( కంది ) మండల విద్యాధికారి శ్రీ జోగప్ప గారు ట్రస్మా రాష్ట్ర సలహాదారులు పూసల లింగగౌడ్ గారు, విశ్వం ఏడ్యూటెక్ సొల్యూషన్ - హైదరాబాద్ హెడ్ జీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. రాష్ట్రస్థాయి లో ఎన్నికైన విద్యార్థులకు అక్షర స్కూల్ ప్రిన్సిపాల్ షేక్ అహ్మద్, అబకస్ మరియు వేదిక్ మాథ్ టీచర్స్ సాగరిక, ఇ. సంగీత గారు అభినందించారు.