
పయనించే సూర్యుడు, డిసెంబర్ 12( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )
చెరుకుపల్లి రాకేష్రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జిల్లెల్ల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దుబ్బాక రజిత రమేష్ ప్రచారం భారీ ఎత్తున కొనసాగుతోంది.బ్యాలెట్ నెంబర్ 3 – బ్యాట్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ రజిత రమేష్ నిర్వహించిన ప్రచారానికి ఈరోజు జిల్లాల ఎక్స్ రోడ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.ప్రజాసంచారం సందడిగా మారిన ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. గ్రామ అభివృద్ధి, శుద్ధి నీటి సరఫరా, రహదారి సౌకర్యాలు, వెలుగుల ఏర్పాట్లు వంటి పలు అంశాలను ప్రజలు ముందుకు తీసుకెళ్తానని రజిత రమేష్ హామీ ఇచ్చారు.ప్రచారం ఉత్సాహభరితంగా సాగుతుండగా, గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుకు బలమైన మద్దతు తెలిపారు.