పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాసరెడ్డి
జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు నగరానికి అవార్డులు తీసుకురావడంలో వారి పాత్ర కీలకమని సత్ సేవ సంస్కృతి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు పేర్కొన్నారు. సత్ సేవ సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేకానంద డివిజన్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఆయన వాటర్ బాటిల్స్ ను ఆయన శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజం నిద్రలేవకముందే నగరంలో ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులు శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్య పారిశుద్ధ పరిరక్షణలో నిత్యం సేవలు అందిస్తున్నారని వారు అభినందనీయులన్నారు. పారిశుద్ధ కార్మికులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. పారిశుద్ధ నిర్వహణ పరిశుభ్రతలో కార్మికుల పనితీరు గొప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్ సేవ సంస్కృతి ఫౌండేషన్ ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, కార్యదర్శి రామ్మోహన్ రావు, సలహాదారులు మహేష్ గౌడ్, సభ్యులు సాయి, సుహాస్, నరేష్, జర్నలిస్టులు నాగరాజు యాదవ్, ఎల్లకొండ జయకుమార్ గుప్తా, హరి, తదితరులు పాల్గొన్నారు.