//పయనించే సూర్యుడు// జులై31//మక్తల్
వైద్య విద్య ప్రవేశానికి తెలంగాణ విద్యార్థులకు స్థానిక కోటా చెందాలని కోరుతూ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కలిసి వినతి పత్రం అందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో 33 ను అమలు చేయాలని మంత్రిని కోరారు. విషయమై మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు మరియు డి సుధాకర్. మెడికల్ విజయ్ కుమార్. మేస్త్రి విజయ్ కుమార్. సాయిల్ మేస్త్రి. విజయ్ కుమార్. ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.