
పయ నించే సూర్యుడు జూలై 4 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) ముక్తేశ్వరం లో బీజేపీ మండల సమావేశం
పాల్గొన్న కర్రి చిట్టిబాబు, గనిశెట్టి వెంకటేశ్వరరావు, విళ్ళ దొరబాబు అయినవిల్లి మండల బీజేపీ సమావేశం శుక్రవారం ముక్తేశ్వరం బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా మాజీ అధ్యక్షులు కర్రి చిట్టిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విళ్ల దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో బీజేపీ బూత్ ఏజెంట్లు అందరూ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చురుకుగా పాల్గొని ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. అలాగే ప్రతి వారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న 'జనతా వారధి' కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షులుగా గుర్రాల వీరకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శిగా ఆకుల గంగబాబును ఏకగ్రీవంగా నియమించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులకు అతిథులు అభినందనలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. మండల మోర్చా ల కమిటీలు ఈ నెల 20 లోపు పూర్తి చేయాలన్నారు. అనంతరం పులువురు బీజేపీ పార్టీ లో జాయిన్ అయ్యారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శులు మొగలి దుర్గారావు, సరెళ్ళ దాస్, జిల్లా కార్యదర్శి మోకా ఆదిలక్ష్మి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు, ఏఎంసీ డైరెక్టర్ కుడుపూడి సత్యవేణి, సీనియర్ మహిళా మోర్చా నాయకులు ఆకుమర్తి బేబీ రాణి, యనమదల రాజ్యలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు కుడుపూడి చంద్రశేఖర్, జిల్లా కిసాన్ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ మిద్దె నూతన రవిరాజ్, మండల ఉపాధ్యక్షులు ముషిని సత్యనారాయణ, అడపా వీరేశ్వరరావు, మండల కార్యదర్శి వరదా మరియమ్మ, పసలపూడి శ్రీనివాస్, వరదా కిట్టయ్య, కస్తూరి శ్రీనివాస్, కంచర్ల శివరామ్, గొల్ల కోటి కృష్ణారావు, అల్లవరపు శర్మ, ఎన్. సూర్యనారాయణ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.