//పయనించే సూర్యుడు//జులై 8 మక్తల్
జులై 9న కార్మిక, కర్షకుల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగే సమ్మె విజయవంతం చేద్దామని , సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బల్ రామ్ CITU జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోవింద్ రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం రోజు మక్తల్ పట్టణ కేంద్రంలో వారు మాట్లాడారు . పిలుపునిచ్చారు . నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాలుగా కార్మికులపై రైతులపై సామాన్య ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నదని విమర్శించారు . స్వాతంత్రం పూర్వం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు అన్నిటిని సవరించి యజమానులకు అనుకూలంగా నాలుగు కార్మికోడ్లు తీసుకొచ్చారని నాలుగు కార్మిక కోడ్లు అమలు అయితే కార్మికులు కట్టు బానిసత్వంలోకి నెట్టేయబడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీసవేతనం 26 వేలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు. ఉపాధి హామీ పథకానికి ప్రతి సంవత్సరం బడ్జెట్లో కోత విధిస్తున్నారని విమర్శించారు . ఉపాధి కూలీలకు సంవత్సరంలో 200 పని దినాలు కల్పించి , రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు సోమినాథ్ సిఫారసులు అమలు చేయాలని గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతును వ్యవసాయని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి పద్ధతికి నిరసనగా దేశవ్యాప్తంగా జూలై 9 కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయుననున్నానని తెలిపారు . అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కార్మికులు కర్షకులు ఐక్యంగా నిరసన ర్యాలీలలో సభలలో పాల్గొనాలని కార్మిక కర్షక వ్యతిరేక విధానాల పైన నిరసన వ్యక్తం చేయాలని వారు పిలుపునిచ్చారు